24, అక్టోబర్ 2010, ఆదివారం

That's OK Daddy.. It's just a dream

ఈ రోజు పొద్దునే నా కూతురు నన్ను నిద్ర లేపి, "డాడీ. I had a bad Dream" అంది. మనం మామూలుగా అన్నీ వినేసి వోదిలేసే టైపు కాదు కదా? అందుకని నిద్ర మత్తులో మంచం దిగకుండానే, ఎప్పటి లాగే "Tell me what happened." అన్నాను. క్లుప్తంగా దాని కల, దాని బాషలో ఇలా.
"నువ్వు, నేను, అమ్మ ఎక్కడికో వెళుతున్నాము అంట. నువ్వేమో కార్ డ్రైవ్ చేస్తున్నావు. నేను అమ్మ కూర్చున్నాము. ఇంతలో ఒక అబ్బాయి ఒచ్చి నా లంచ్ బాక్స్ దొంగతనం చేసాడు. నేను నీకు చెప్పినా నువ్వు అస్సలు పట్టించుకోలేదు. అలా డ్రైవ్ చేస్తూనే వున్నావు. ఆ అబ్బాయి నా లంచ్ బాక్స్ దొంగతనం చేసాడు. ఆ అబ్బాయి చాలా చెడ్డ అబ్బాయి."


నేనేదో దాన్ని ఊరుకోపెడుతున్నట్లు నిద్ర మత్తులో "పోన్లే తల్లి, నీకు ఇంకో లంచ్ బాక్స్ కొనిపెదతానులే" అన్నాను.
దానికి సమాధానం గా, "That's OK Daddy.. It's just a dream. I still have my lunch box. You don't have to buy me one."
మత్తు ఒదిలి మంచం మీద నించి లేచి కూర్చున్నా. పళ్ళు తోముకుంటూ ఆలోచిస్తు అనుకున్నాను,
 "దీనికి కలకి - వాస్తవానికీ తేడా తెలిసిపోయింది. నాకే ఎప్పుడు ఏ భరోసా ఇవ్వాలో తెలియదు".

6 కామెంట్‌లు:

  1. Kids do grow up fast.. it is just that we take a little time to accept it..

    రిప్లయితొలగించండి
  2. చందు గారు, ఆది అంతె మనకు ముద్దుకొద్ది మనకు ఇంకా చిన్నగానె కనిపిస్తారు కాని వాళ్ళు వయస్సు పరిణితి, మానసిక పరిణితి తొ అలా అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న మాటలు భావాలతొ మనకు అలా షాకులు .

    రిప్లయితొలగించండి
  3. sree,
    You are correct. I feel I am left behind in understanding her next stage all the time.

    రిప్లయితొలగించండి
  4. rameshsssbd,
    నిజమే. ఎప్పుడైనా యూ ఆర్ మై బేబీ అంటే, నేనేమి బేబీ ని కాదు అని సమాధానం చెపుతుంది.

    రిప్లయితొలగించండి
  5. నాకెందుకో మీ పాప bad dream ఆంది luch box కోసమనిపించట్లేదు. బహుశా మీరు తన లంచ్‌బాక్స్ పోయినా పట్టించుకోనందుకేమో (కలలోనే లెండి). మరి కొత్త lunch box కొనిపెడతానన్న మీ నిజ లోకపు assurence తనకర్ధమయ్యొందోలేదో.

    రిప్లయితొలగించండి
  6. Indian Minerva,
    ఈ యాంగిల్ లో నేను ఆలోచించలేదు సుమండీ.

    రిప్లయితొలగించండి