27, అక్టోబర్ 2010, బుధవారం

మాంచి మిటాయి కిళ్ళీ కట్టు బాబు


  చిన్నప్పుడు పెద్ద వాళ్ళు తినే మిటాయి కిళ్ళీ అంటే చాలా మోజు వుంటుంది. ముఖ్యంగా అందులో వుండే తీపి  ITEMS మూలంగా. అప్పుడప్పుడు అమ్మ కోసం తెచ్చిన మిటాయి కిళ్ళీ అమ్మ వెంట పడి సతాయిస్తే అందులో చిన్న ముక్క కొరుక్కోనిచ్చేది. అలా మొదలయ్యింది నాకు మిటాయి కిళ్ళీ మోజు. అప్పుడప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న లేకపోతే - అక్కనో, అన్నయనో పట్టుకుని నీకు మీటా పాన్ చేస్తానని చెప్పి బతిమాలేవాడిని. వాళ్ళు ఒప్పుకుంటే, తమలపాకులు రెండు తీసుకుని వాటి మీద పేస్టు కొంచెం సున్నం లాగ అద్దేవాడిని. ఆ తర్వాత కిచెన్ లో వండే సామాన్ల లో నాకు నచ్చినవి అంటే కొంచెం కొబ్బరి, పంచదార పొడి, బెల్లం, యాలకులు లాంటివి వేసి, చివరలో వొక్కపొడి వేసి చుట్టి ఇచ్చేవాడిని. ఒక్కో సారి నచ్చేది, కానీ ప్రతీసారి "ఇందులో ఏమి వేసావు?" అనే ప్రశ్న ఒచ్చేది. ఏమి వేసామో చెప్తే వాళ్లకి తప్పకుండా నచ్చదు. ఇలా సాగేది నా కిళ్ళీ కట్టుడు అలవాటు. అయితే ఇక్కడితో అయిపోలేదు.
నేను ఇంటర్ చదివే రోజుల్లో, మా బావ వాళ్ళ ఇంట్లో వుండే వాడిని. కొన్ని అనుకోని పరిస్థుతులలో అక్కడ కిళ్ళీ కొట్టు ఒకటి వుండేది. మా బావ చేసేది వుద్యోగం, నేను చదివేది చదువు కాబట్టి. నేను సాయంత్రాలు కిళ్ళీ కొట్టు తెరిచే లా నాకు ఆర్డర్లు జారి అయ్యాయి. అది విజయవాడ లో సీతారాంపురం పెట్రోల్ బంక్ దగ్గర అన్న మాట. 
 నేను కాలేజీకి వెళ్ళే ముందు, కాలేజీ అయ్యాక కొట్టు తెరవాలి. అంటే ముందుగా చిన్న డబ్బా తాళం తీసి, ఆ డబ్బాలో దూరి రేకు కిటికీ తీసి, కొక్కేలు తగిలిస్తే మన బడ్డి కొట్టు ఓపెన్ అన్న మాట. అయితే వెంటనే బయట ఒక చాంతాడు వెలిగింఛి పక్కన వున్న పోలు కి కట్టాలి. ఆ తర్వాత పెద్ద జాడీలు తుడుచుకుని వాటిలో చిక్కీలు, మర మరాల ఉండలు, జన్తికీలు, చేగోడీలు, సోం పాపిడి, బిస్చ్కట్లు, చాక్లెట్లు,  ఇంకా మరేమో పిప్పెరమెంటు బిళ్ళలు లాంటివి అవసరాన్ని బట్టి నింపుకోవాలి. మర్చిపోయాను వుంటే అరటి గెల బయట కట్టేయ్యాలి. ఇంటి నించి తెచ్చుకున్న చిల్లర పోసుకోవాలి. ఆ తరవాత సిగేరెట్లు విడిగా పెట్టుకోవాలి. ఇంటి నించి తెచ్చుకున్న తమలపాకులు నీళ్ళల్లో వేసుకోవాలి. కొత్తల్లో పేపర్ కూడా అమ్మేవాడిని, అవి బయట జాడీల కింద వేళ్ళాడ దియ్యాలి.  ఇంకా ఏమైనా పీచు మిటాయి లాంటివి వుంటే పైనించి వేళ్ళాడుతున్న కొక్కేలకి తగిలించాలి. ఇంకా మన కిళ్ళీ బడ్డీ రెడీ.
ఆ తరవాత మనకి ఒచ్చే బేరాలు అయితే పొద్దున్న ఎక్కువగా పేపర్, మధ్యాన్నం నించీ కిళ్ళీలు ఎక్కువగా ఒస్తాయి. పాపం చిన్న పిల్లలు ఒక్కో సారి  జీడికని, పిప్పెర్మేంట్ కనీ ఒస్తే వాళ్ళ దగ్గర ఐదు పైసలు తక్కువ అయినా ఇచ్చేసేవాడిని. ఎందుకంటె కిళ్ళీ బడ్డి మనది కాదు, పైగా మనకి చినప్పుడు అనుభవాలు గుర్తుకొచ్చేవి. ఆశగా డబ్బులు పట్టుకుని వెళ్తే డబ్బులు తక్కువ అయ్యాయని  కొట్టు వాడు పొమ్మంటే చాలా కోపం ఒచ్చి అడ్డమైన తిట్లు తిట్టుకున్నాము కదా! అందుకని మనల్ని వాళ్ళు అలా తిట్టుకోకుండా ఇచ్చేసేవాడిని. ఇవన్నీ కాలేజీ కెళ్ళే కుర్రాడిని నేను చెయ్యడం నచ్చక పోయినా, ఎవడైనా కిళ్ళీ అడిగితే బలే హుషారుగా కట్టేవాడిని. అదే మిటాయి కిళ్ళీ అడిగితే ఇరగదీసి లావు కిళ్ళీ కట్టేవాడిని. సరుకులు ఐపోతే పెద్ద  బజార్ కి వెళ్లి ఆకులు, సిగరట్టు తేవాల్సి ఒచ్చేది. వాటితో పాటు  కిళ్ళీ సరుకులు అవసరం లేకపోయినా ఎక్కువ తేవడం లాంటివి చేసేవాడిని. ఎవడైనా మన బడ్డీ కొచ్చి "మాంచి మిటాయి కిళ్ళీ కట్టు బాబు", అంటే ఇప్పుడు టీవీ లో ఒచ్చే డయరీ మిల్క్ చాక్ యాడ్ లో లాగ "లడ్డూ కావాలా నాయనా?" అన్నట్లు వినిపించేది. ఇంక చూసుకోండి,  మన ప్రతాపం చూపించి (చిలకలు కట్టి నోట్లో పెట్టడం తప్ప) మాంచి కిళ్ళీ కట్టే వాడిని.
ఇప్పటికీ మా అమ్మాయి పుట్టిన రోజు పార్టీ చేస్తే చివర్లో అందరికీ మిటాయి కిళ్ళీ సప్లయ్ మస్ట్ అండ్ షుడ్డు అన్న మాట. నా కిళ్ళీ బడ్డీ అనుభవం చాలా మందికి తెలీదు గానీ లేకపోతే అందరూ "కొన్నారా? మీరే కట్టేరా?" అని అడిగేవాళ్ళు.

14 కామెంట్‌లు:

  1. Chandu garu:
    "లడ్డూ కావాలా నాయనా?" Em timing Dialouge
    Idhi Adirindi :)
    Okka sari ga pakkuna navvesa :)

    రిప్లయితొలగించండి
  2. మా నాన్న బాబా జర్దా కిళ్ళీ వేసుకునేవాళ్ళు.మేము కుడా కట్టేవాళ్ళము ఇంట్లో. మిథాయి కిళ్ళీ భలే వుంటుంది....గుర్తు చేసినందుకు సంతోషం చందు గారు.ఇప్పటికి పామర్రు లో అప్పుడప్పుడు తింటూనే ఉంటాము లేదా కోడూరు లో మా రామలింగని కొట్లో...

    రిప్లయితొలగించండి
  3. కిళ్ళీకొట్టు కళ్ళకు కట్టినట్టు చెప్పారుగా!....నాకు కిళ్ళీ భలె ఇష్టం కాని ఆ తరువాత నోరు రుచి తెలియదు కదా! అందుకని కష్టం కూడా :)

    సున్నం బదులు పేస్ట్ ఉపయొగించిన మీ మేధాశక్తి కి జోహార్లు :))

    రిప్లయితొలగించండి
  4. Jaabili,
    Andukenandi ingredients cheppamu. Chepthe nachchadu. Thinte baavuntundi.

    రిప్లయితొలగించండి