23, అక్టోబర్ 2010, శనివారం

బెండకాయలేరే మొగాళ్ళు లోకువ

బెండకాయలేరే మొగాళ్ళు అంటే సాటి మగవాళ్ళకు లోకువ. ఆడవాళ్ళకు అయితే మరి ఇంక చెప్పకర్లేదు. ఆ ఏరేది మొగుడు అయితే కొంచెం రిలీఫ్ అని నేను అనుకుంటున్నాను. అసలు చాలా మంది ఆడవాళ్ళకు వంట వొచ్చిన మగ వాళ్ళతో పెద్ద తంటా. ఈ టాపిక్ మీద మనం మళ్ళీ మరో టపా వేసుకుందాము తరవాత. ఇంతకీ బెండకాయలేరే మొగాళ్ళ గురించి మాట్లాడుకుందాం.
  అసలు గ్రోసరీ కి లిస్టు రాసుకుని, తీరిగ్గా కూరగాయల షాప్ కి వెళ్లే మగ వాళ్ళు అంటే కొంత మిగిలిన మొగవాళ్ళకు లోకువ. వంట ఆడవాళ్ళ పని అనే వాళ్ళ ఉద్దేశ్యం. నేను పెళ్ళికి ముందు కూడా తీరిగ్గా ఇండియన్ సబ్జీ మండి కి వెళ్లి అన్ని కూరగాయలు తెచ్చేవాడిని. అందులో బెండ కాయలు ఏరడం పెద్ద తంటా, దొండకాయలు తరగటం పెద్ద కడుపు మంట. మా రూమ్మేట్ దొండ కాయలు తరిగేటప్పుడు నన్ను తిట్టుకున్న సందర్భాలు కూడా చాలా వున్నాయి.  కూరల దుకాణంలో కేవలం బెండకాయల దగ్గరే ఎక్కువ రష్ వుంటుంది. ఎందుకంటె మిగిలినవి అన్నీ  గిచ్చో,రక్కో,నొక్కో లేదా రంగుతోనో, రూపంతోనో ఏరి పారేయ్యచ్చు. కానీ ఈ బెండకాయలు మటుకు తోక విరగ్గోట్టాలి. పోనీ పక్క వాడు ఆల్రెడీ విరిచేసిన బెండకాయ మనం యేరుకుంటామా అంటే అదీ కుదరదు. ఎందుకంటె మనం విరిచినప్పుడే టక్కు మనాలి. అదీ మరీ కొసలో, తోక చివరన అయితే ముదురుది ఐనా విరిగిపోతుంది. కాబట్టి ఈ బెండకాయల ఎంపికలో మా చెడ్డ చిక్కు ఉంది. పోనీ ఏదో ఒకటి అని చేతికందినవి తెచ్చి కూర చేసి పారేసామా, ముదురు బెండకాయలతో ఏమి చేసినా అస్సలు బావుండదు.
  అసలే నా కూతురు ఇష్టంగా తినేది ఈ కూర ఒక్కటే. ఇది తప్ప అన్నీ అమెరికన్ కూరగాయల షాప్ లో ఇంచుమించు దొరికేస్తాయి. కనీసం దానికి కూర చెయ్యడానికైనా సరిపడా తేవాలని కక్కుర్తి కొద్దీ దూరం డ్రైవ్ చేసుకుని వెళ్తానా, అక్కడ లేతవన్నీ జనాలు ఎరేసుకున్నాక అడుక్కి వున్నవి మన కంట పడ్డాయంటే - నరక యాతన. అక్కడ సముద్రంలో ముత్యాలు పట్టినట్లు పట్టాలి, పావు గంట తర్వాత చూసుకుంటే పది కూడా దొరకవు. వాటితో కూర చేస్తే నంచుకోడానికే సరిపోవు. పోనీ మన అదృష్టం బావుండీ వాడు కొత్త బాక్స్ తీసి కుమ్మరించాడో, వెంటనే ఒక పది మండి లేడీస్ ఇవి మా ఫింగర్స్ అని వాటి మీద చేతులేసి ఏరుతుంటారు. ముగ్గురు పట్టే ప్లేస్ లో ఆల్రెడీ పది మంది లేడీస్ లేడీ ఫింగెర్స్ ని విరగ్గోడుతుంటే, తోసుకుని నా లాంటి వాడు వెళ్లి, సరిగ్గా కనపడక ఏ లేడీ ఫింగరో పట్టుకుని తోక అనుకుని గోరు విరిచానో, నా పని "దుకాణంలో మద్దెల దరువు - ఇంటి దగ్గర (ఎగిరెగిరి) పసుపు దంపు". అసలే మనకి మొహమాటం, పైగా కొంత మంది ఏరే టప్పుడు "ఈ లెఫ్ట్ నా ఏరియా అక్కడ చెయ్యి పెట్టావో విరిగేది బెండకాయ కాదు" అన్న రేంజ్ లో ఒక లుక్ ఇస్తారు. అందుకని ఒక మూలగా ఎవరికీ తగలకుండా బురదలో మట్టి పిసుక్కునే వాడి లాగ కింద నించి పైకి చేసి కొన్ని లేత బెండకాయలు ఏరే ప్రయత్నం చేస్తానా, ఇంతలో తను యేరు తుంటే దొరకబోయిన వజ్రం మీద నేనేదో మట్టి కప్పేసినట్లు ఇంకొక లేడీ చూస్తుంది. మొగుడు తంతుంటే, తోటి కోడలు వీడియో తీసినట్లు ఎక్కడినించో ఒక మగాడు సెల్ ఫోన్ లో పెళ్ళాంతో మాట్లాడుతూ సంచీలో మూడు గుప్పిళ్ళు బెండకాయలు వేసుకుని ఒక సారి పైకి కిందకి ఊపి (తూకం - ఒక్క ఊపుతో, కంటి చూపుతో లెక్కేసే టైపు లో) "ఆ తీసేసుకున్నా. దొండ కాయలు కావాలా?" అని మాయమైపోతాడు. అప్పుడు పక్కన ఆడవాళ్ళు నాకేసి చూసే చూపుకి లేడీస్ బాత్రూం కెళ్ళిన జెంట్ లాగ వుంటుంది నా పరిస్థితి.
 ఇంతా ఏరి హీరో లా తెచ్చానని అనుకుని రిలీఫ్ గా పట్టి కెళ్ళి మా కార్ట్ లో వేస్తుంటే "అది దానికి ఒక్కదానికే సరిపోతాయి" అని మా ఆవిడ అంటుంటే పంపు దగ్గర నీళ్ళు పట్టే మొగాడికి పెళ్ళాం మీద వచ్చినంత కోపం వొస్తుంది. అదే ఏ మగ  ఫ్రెండ్ తోటో వెళ్తానా, నేను బెండకాయల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు ఇంక వీడు అరగంటైనా రాడు అని మెల్లిగా బయటకి జారుకుంటాడు.  ఒక పక్క ఏరుతూ, ఇంకో పక్క వాడిని ట్రాక్ చెయ్యడం కాన్ఫరెన్స్ మాట్లుడుతూ కోడింగ్ చేసినంత కష్టం.
అందుకనేనండి నేనంటున్నా "బెండకాయలేరే మొగాళ్ళు అందరికీ లోకువ". ఎవరేమనుకుంటే నాకేంటి, బెండ కాయ వేపుడు అన్నంలో నెయ్యతో కలిపి ముద్దలు పెడుతుంటే నా కూతురు తింటుంటే నాకనిపిస్తుంది, "దీని కోసం వెళ్లే దూరాలు, ఆడవాళ్ళ చూపుల ఘోరాలే కాదు - లేత బెండకాయ చోరీ లాంటి పేపర్లో పడ తగ్గ నేరాలైనా చేసెయ్యచ్చు" అని.  

16 కామెంట్‌లు:

  1. మీ అమ్మాయి కోసం మీరు ఏమి చేయడానికైనా రెడీగానే ఉంటారని మాకెప్పుడో అర్థమయిపోయింది :) కానీ లేత బెండకాయలు ఏరడానికి అంత కష్టపడక్కరలేదండి. విరిచి చూడకుండానే లేతవి ఏరచ్చు. :)
    Good post.

    రిప్లయితొలగించండి
  2. మీరు బెండకాయలంటున్నారు, నేనూ మా అమ్మాయిని త్రిల్ చెయ్యటానికి ఒక్కడినే మాల్ కెళ్ళి చుడీదార్లు చూపించమని అడిగితే చుట్టూ ఉన్న వాళ్ళు ఈ వయసులో వీడికి ఇదేమి బుద్ది అన్నట్టు చూస్తున్నారు( అర్ధం అయిందా)

    రిప్లయితొలగించండి
  3. హ్హహ్హహ్హా!! భలే ఫన్నీ గా వ్రాసారే! హ్మ్!! చాలా కష్టపడుతున్నరుగా బెండకాయలతో....నేను బెండకాయల దగ్గర అస్సలు మొహమాటపడను..మీలాగే మా చందుగారు ఆడవాళ్ళని చూసి కొంచెం దూరం జరిగి పాపం ఒక్కొక్క బెడకాయ ఆగి ఆగి వాళ్ళకి ఎక్కడ తగులుతానో అని తీస్తూ ఉంటారు...అప్పుడే శ్రీకృష్ణుడిలా నేను ప్రత్యక్షమయి 'నేను..నేను తీస్తా కదా!' అని చెప్పి ఎలాగోలా దూరేసి లేతలేత భేండీలు పట్టుకొచ్చేస్తా :)

    రిప్లయితొలగించండి
  4. Siri is very lucky chandu... tandri prema undatam veru adi express cheyyadam veru.. manishiki tanaki lenidi ante oka apuroopam kadaa.. meeru mee ammaayikosam/gurinchi/toti chese panulu raaste naaku chaala mucchatagaa untundi... naaku panduki ilaanti adrushtam vacche janmalo tappakundaa ivvu devudaa anukuntaa..kantipaaplaaga choosukunnaa kooda koni lotulu teerchalem kada... meeru enta comedygaa raasinaa posts naaku kanneellu teppistay.

    రిప్లయితొలగించండి
  5. oh chaala baaga raasaru chandu gaaru, mi ammayi chaala lucky... ya bendakaayalu varaku enduku indian market antene ma harsha laanti vaallaki adi ammayi la wrk ani oka feeling... hmmm, meeru chaala gr8 ee vishayam lo

    రిప్లయితొలగించండి
  6. శిశిర,
    బాగా చిన్నవి ఐతే కొంచెం రంగు బట్టి అంచనా వెయ్యచ్చు. కానీ పక్కాగా ఐతే ఎలాగో తెలియదు. అప్పటికీ సిగ్గు విడిచి కొంత మందిని అడిగి చూశాను. ఇలా అని ఎవరూ చెప్పలేకపోయారు. మొన్న ఇండియాలో చూస్తే అక్కడి బెండ కాయలు, ఇక్కడి బెండకాయలు చాలా తేడా ఉన్నాయి. మీరు కొంచెం హింటు ఇవ్వండి, ఈ సారి ట్రై చేస్తా.

    రిప్లయితొలగించండి
  7. ఆత్రేయ,
    నిజమే. నేను ఎప్పుడైనా మ ఆవిడ హాండ్ బాగ్ మోస్తూ, ట్రైయల్ రూమ్ ముందు WAIT చేస్తుంటానా - నన్ను చూసే చూపులు ఒక రకంగా ఉంటాయి

    రిప్లయితొలగించండి
  8. ఇందు,
    మీ చందు గారు లక్కీ అండీ.

    రిప్లయితొలగించండి
  9. Sree,
    Thanks for the compliment. God bless you both with best of the things always.
    Just like you said in your post Pandu is Bangaaru Konda. Look at the positive side, she has you. Best of the best..

    రిప్లయితొలగించండి
  10. sreechandana,
    Nannu koodaa naa friends kondaru aadavaalla laaga neekendukuraa antoontaaru.

    రిప్లయితొలగించండి
  11. u remind me of my father...maa amma enta mottukunna, muddu chesi paadu chestunnarani, he used to pamper me a lot n v both used to give my mother a sheepish smile....i was his princess....noru terichi adagakamunde naa manasu telsukunevaru...i tried to return his love back..i was first in studies, always topper, n career wise also, while all my cousins were settled as housewives, i was progressing too well...ippudu maa nanna ade pani chestunnaru..naa pillaltho...n nenu mottukuntunnanu...plz. athi garabam cheyyoddu ani..n tata manavallu istaru nako sheepish smile:)

    రిప్లయితొలగించండి
  12. నిజమే. అందుకే నేను ఫ్రోజెన్ కి సెటిలైపోయా

    రిప్లయితొలగించండి
  13. కొత్త పాళీ,
    గుడ్. అందులో ఇంక ఏరుకునే ప్రశ్నే లేదు.

    రిప్లయితొలగించండి
  14. benda kayala meeda antha vyasama?saradagane vundi.nenu patha tharam vanni.anduvalla koorala konugolu eppudoo cheyyaledu.adantha intlo ladies .choosukontaru.meeru rasindi mathram thamashaga vundi.ramanarao.muddu

    రిప్లయితొలగించండి