"దేశి గాడికి దేశి గాడే శత్రువు" అని అంటే నమ్మాలి మరి. ఉదాహరణకి మీరు అమెరికాలో ఇంటర్వ్యూ కి వెళ్లారు. తెల్ల వాళ్ళు అందరికీ మీరు నచ్చుతారు. ఒక నల్ల వాడు వున్నా, వాడికి కూడా నచ్చుతారు. కానీ అందులో ఒక దేశి - తమిళ్ గాని, తెలుగు గాని, నార్త్ ఇండియన్ గానీ ఉన్నాడంటే, వాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీకు ఏది రాదో నిరూపించాలని తెగ ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని ఎలాగైనా తిరస్కరించాలి. అదీ వాడి వుద్దేస్సం. ఎందుకంటె వాడికి అక్కడ వున్న వాళ్ళెవరూ పోటీ కాదు, మీకు వుద్యోగం ఒస్తే మీరు పోటీ అవుతారని వాడి భయ్యం. అందుకని మిమ్ములని వాడు మొదట్లోనే తున్చేయ్యాలి. ఇలా దేశి గాళ్ళు చేసే ఇంటర్వ్యూ అంతా నీకేమి ఒచ్చు, ఉద్యోగానికి సరిపోతావా అని చూడకుండా, నీకేమి రాదో కని పెట్టి -నువ్వు పనికి రావని చెప్పడానికి కారణాల కోసం జరుగుతుంది. ఈ జబ్బు మన వాళ్ళకే వుంటుంది.
దీనికి ముఖ్య కారణం అభద్రతా భావం. మనకి మనమే శత్రువులం. అలాగని అవతల మనల్ని ఇంటర్వ్యూ చేసే వాడు పెద్ద ప్రతిభావంతుడు, నిజాయితీ పరుడు అనుకుంటే పొరపాటే. వాడు దొంగ అనుభవాలతో, తక్కువ పరిజ్ఞానం తో ఉద్యోగంలో కొచ్చి - పగలూ రాత్రీ కష్టపడి పని చేసి ఒక రకంగా అక్కడ కొంత స్థిరపడి ఉంటాడు (అందరూ కాదనుకోండి). మీ రాక వాడి ఉనికికి ప్రమాదం, అందుకని వాడు మిమ్మల్ని అంతా త్వరగా రానివ్వడు.
నేను ఒక్కోసారి గ్రూప్ గా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాతో పాటు ప్రశ్నలు వేసే దేశీలని చూస్తుంటాను. వాళ్ళు ప్రశ్నించే పద్ధతి, నేను నీకంటే గొప్ప- నీకు, ఉద్యోగానికి మధ్య నేను అడ్డు, నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు అన్న తరహాలో వుంటాయి. ఒక సారి అయితే నేను చిర్రెత్తి, "చూడు బాబు. మనం ఇక్కడ జనాలని ఏడిపించి మన ఆధిపత్యం చూపించక్కర్లేదు. వుద్యోగం చెయ్యగలడా? కష్ట పడే మనిషా? అని చూస్తే చాలు" అని చెప్పాల్సొచ్చింది.
ఉద్యోగాలలో కూడా ఎక్కువ మంది దేశీలు వుంటే, అక్కడ రాజకీయాలు మొదలు. పక్కవాడి కంటే ముందే మనం పైకి వెళ్ళిపోవాలని ఉండటంలో తప్పులేదు, కానీ అది దేశి గాడు అయితే అస్సలు తట్టుకోలేరు.
అసలు ఈ జబ్బు మన వాళ్ళలో చాలా ఎక్కువ. మిగిలిన వాళ్ళు అయితే ఒకళ్ళకి ఒకళ్ళు బాగా సాయం చేసుకుంటారు. నేను పని చేసిన కొన్ని కంపెనీ లలో అయితే ITALIANS , RUSSIANS , ఫిల్లిపిన్స్ బాగా వాళ్ళ మనుషులకి సాయం చేసుకుంటారు. పైకి వెళ్ళిన వాడు వాళ్ళ దేసస్తున్ని పైకి తీసుకొచ్చేవాళ్ళు. మన వాళ్ళు మటుకు ఒకడు పైకి వెళ్తుంటే, ఇంకోడు వాడిని కిందకి లాగే ప్రయత్నం చేస్తూంటారు. ఈ విషయంలో మనకన్నా CHINESE చాలా నయం.
మన వాళ్ళలో ఇంకో జబ్బు ఏమిటంటే, ఎవడికి వాడు "నేను ఒచ్చేవరకూ అంతా బానే వుంది, కానీ ఆ తరవాతే ఎవడు పడితే వాడు ఒచ్చేస్తున్నాడు" అనే ధోరణి. మళ్ళీ మనకి లేని గ్రీన్ కార్డు పక్క వాడికి వుంటే కడుపు మంట, మనకంటే ఎక్కువ ఎవడైనా సంపాదిస్తే "ఛాన్స్ కొట్టాడు". అదే మనమైతే మన ప్రతిభ అని, మనం స్పెషల్ అనీ ఫీలింగ్.
మళ్ళీ కులాలు, మతాలు, జిల్లాలు, వర్గాలు, పార్టీలు, ఫాన్స్ ఇవన్నీ మనిషికీ మనిషికీ అడ్డు.
ఒక్కో సారి నేను అనుకుంటాను గ్లోబల్ డిమాండ్, టెక్నాలజీ బూం, ఔట్సౌర్సింగ్ ఇవన్నీ కలిసొచ్చి, చాలా మందికి నడి మంత్రపు సిరి ఒచ్చింది. అందుకేనేమో ఈ శత్రుత్వాలు. అదే మిగిలిన దేశాల వాళ్ళలాగా ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని శరణార్ధులుగా ఒస్తే కలిసి వుండే వాళ్ళమేమో.
నేను ఒచ్చిన కొత్తలో కొందరు RUSSIANS నా కలీగ్స్, మా ఇంటికి ఒచ్చి కుర్చీలు గట్రా సామాన్లు తెచ్చి పడేసేవాళ్ళు. వాళ్ళు అంతా శరణార్ధులుగా ఇక్కడికి ఒచ్చారు. వాళ్ళు నాకు అన్నీ తెచ్చి ఇస్తుంటే వొద్దని ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు. ఒక రోజు అందరినీ కూర్చో బెట్టి, బాబూ నాకు కావాలంటే నేను అన్నీ కొనుక్కోగలను, మీరు ఇవన్నీ ఎవడైనా లేని వాడికి ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక్కడికి ఒచ్చినప్పుడు వాళ్లకి తిండి కూడా లేదుట, తోటి దేశస్తులు దయతో వాడుకున్నవి ఇస్తే వాటితో బతికే వాళ్ళట. ఏది కొనాలన్నా, వాడేసినవి అమ్మే త్రిఫ్ట్ షాప్ లో కొనుక్కునే వాళ్ళట. నేను అలాగే అనుకుని, వాళ్ళతో కలిసిపోయనని నాకోసం అందరూ ఇలా తలోకటీ అనుకున్నారట. బాబూ! నాకు లేనిది కారు ఒక్కటే, అది కూడా నాలుగు నెలలు జీతం ఒస్తే కొనుకుంటాను, కాబట్టి మీరు నాకు పిక్ అప్, డ్రాప్ అఫ్ మాత్రమే సాయం చెయ్యండని చెప్పాను. పాపం నాకే కాదు, నా స్నేహితులని కూడా పిక్ చేసుకునే వారు. ఇది మన వాళ్ళలో చాలా అరుదుగా జరుగుతుంది అమెరికాలో.
నేనే కాదు, చాలా మందికి జరిగిన అనుభవాలతో అప్పుడప్పుడు అనుకుంటాను "అమెరికాలాంటి దేశాలలో, దేశీ గాడికి దేశీ గాడే శత్రువు - ముఖ్యంగా ఉద్యోగాలలో".
గమనిక: ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. అందరూ ఇలా వుండరు. మీరు నా టపా చదువుతున్నారు కాబట్టి, మీరు ఆ కోవలోకి చెందరు- అమెరికాలో వున్న సరే.
"దేశీ గాడికి దేశీ గాడే శత్రువు" ఇది చాలా నిజమండి నేను ఒకప్పుడు బాదితురాలినేనండి....
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండిyes...
బాగా చెప్పారు. ఫిలిప్పినోస్ బాగా సహాయ పడతారు తమ వాళ్ళకి. వాళ్ళలో ఐకమత్యం కూడా ఎక్కువే.
రిప్లయితొలగించండిమన దేశీలకే ఈ లేని పోని రాజకీయాలన్నీ.పరాయి దేశానికి వచ్చాము హాయిగా ఉన్నన్ని రోజులూ హ్యాపీ గా ఉందామని ఉండదు.నేను ఫలానా అనో,ఇన్ని ఆస్థులు కొన్నా అనో చెప్పుకోవడమే సరిపోతుంది.
కాస్తలో కాస్త ,తమిళ్ వాళ్ళు,నార్త్ ఇండియన్స్,ఇతర రాష్ట్రాల వాళ్ళు మన కంటే చాలా నయం.మన తెలుగు వాళ్ళలోనే ఎందుకో ఇన్ని రాజకీయాలు.
ఎవడికి వాడు "నేను ఒచ్చేవరకూ అంతా బానే వుంది, కానీ ఆ తరవాతే ఎవడు పడితే వాడు ఒచ్చేస్తున్నాడు" అనే ధోరణి. --- hmm!
రిప్లయితొలగించండిచెప్పాలంటే,
రిప్లయితొలగించండినేను కూడా చాలా చోట్ల ఈ బాధలు పడ్డా. థాంక్స్
మంచు,
రిప్లయితొలగించండిథాంక్స్.
రిషి,
రిప్లయితొలగించండిమన వాళ్ళు పీతల కధ లాగా పక్క వాడిని కిందకి లాగే ప్రయత్నంలో ఉంటారు
కొత్త పాళీ ,
రిప్లయితొలగించండిథాంక్స్.
it is not the isolated case of US. It is across the world wherever telugu people are there.
రిప్లయితొలగించండిsreekanth,
రిప్లయితొలగించండిIkkade anukunnanu. Mana vaallu yekkadaina anthe anna maata.
this is not true
రిప్లయితొలగించండిa2zdreams,
రిప్లయితొలగించండిThat's why I said it's not true for all.
Thanks.
ఇదో అపోహ, ఆక్రోశం మాత్రమే అనుకుంటా. దాదాపు కష్టాల్లో వున్న వాళ్ళంతా అంతా(ఏ ప్రాంత/దేశం వారైనా) అలానే అనుకుంటారు. గమ్మతేమంటే ఇలా అనుకునేవాళ్ళలో చాలామటుకు ఎవరికీ సహాయం చేయని వారే అయ్యుంటారు/అవుతారు. :))
రిప్లయితొలగించండిsnkr,
రిప్లయితొలగించండిమీ అభిప్రాయం తో నేను ఏకీభవించను చెప్పానుగా, అందరి అనుభవాలు ఒకేలా ఉండవని. నేను చాలా చోట్ల చూసింది, అబ్సర్వ్ చేసింది ఇది. మీరు చెప్పినట్లే మీకు ఇలాంటి అనుభవం కాకపోతే ఆధ్రష్టవంతులే. అలాంటి మనిషి కాకపోతే మీ సాయం తీసుకునే వాళ్ళు అదృష్టవంతులు.