30, అక్టోబర్ 2010, శనివారం
బౌ బెల్లా - అనే కుక్కపిల్ల
"బౌ బెల్లా - అనే కుక్కపిల్ల" - బావుంది నాయనా నీ టైటిల్. తరవాత ఏమిటీ, అగ్గి పుల్లా- సబ్బు బిల్లా? అని మీరు ఎటకారం చేస్తే ఇక నేను కట్టు కధలు కట్టి పెట్టాలి నా టపాలో. నిన్న రాత్రి పడుకునే టప్పుడు పుస్తకం చదవమంది మా అమ్మాయి, రొటీన్ గా. దాని పుస్తకాలు చాలా బరువు ఎక్కువ, పడుక్కుని చదివితే పొట్ట మీద పెట్టుకుని పట్టుకోవాలి. అసలే నాకు భుక్తాయాసం. అదేదో ఒక కధ తో ఐపోతే పరవాలేదు, ఒకటి తరవాత ఒకటి చదువుతూనే వుండాలి. అందుకని ఈ సారి మనమే ఒక కధ చెప్తే పోలా అనిపించింది.
కధ- పైగా అదీ కట్టు కధ చెప్పాలంటే ఏదో ఒక సబ్జెక్టు వుండాలి కదా. కొంచెం నా మొద్దు బుర్రకి పదును పెట్టి, ఒక ప్రశ్న సంధించా. నీకు ఏ జంతువు ఇష్టం అని అడిగాను, కుక్క పిల్ల అని చెప్పింది. కొంచెం ఆలోచించి ఈ మధ్య అది నాకు చెప్పిన విషయాల నెమరు వేసుకున్నా.
రెండు రోజుల క్రితం కల ఒచ్చిందని ఒక కధ చెప్పింది. అందులో తను రాకుమారిట, దానిని ఎవరో రాకుమారుడు fight చేసి రక్షిస్తున్నాడట. (అది కధ చెప్పినప్పుడు నా గుండె కలుక్కు మంది. దీనికి ఇప్పుడే ఇంత ప్రిన్సు అండ్ ప్రిన్సెస్ పిచ్చి - మనం దీనికి సంబంధం వెతకాలంటే ఏ రేంజ్ లో వుండాలి అని). "కధ చెప్పు నాన్నా", అని పది సార్లు అడిగే లోపు ఆలోచిన్చేసా.
ఇక కధలోకి - అదేనండి కట్టు కధలోకి ఒస్తే. మనం సంపాదించిన సమాచారంతో అప్పటికప్పుడు ఒక కధ అల్లాను. అదే "బౌ బెల్లా" అన్న మాట.
అనగనగా ఒక చిన్న పిల్లవాడు, వాడి పేరు లిటిల్ పీట్. (ఇలా పేరు ముందు లిటిల్ అని పెడ్తే మనకి తరవాత నాన్నపేరు వేరే ఆలోచించక్కర్లా) వాడికి జంతువులంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న పేరు బిగ్ పీట్. లిటిల్ పీట్, బిగ్ పీట్ ని ఎప్పుడూ ఒక పెట్ కావాలని అడుగుతూ ఉంటాడు. వాడికి నాలుగేళ్ళు. రేపే వాడి ఐదో పుట్టినరోజు. రేపు వాడి పుట్టినరోజు అని చాలా సంతోషంగా ఉంటాడు. రేపు రాబోయే బహుమతుల గురించి, స్నేహితులతో చేయబోయే సందడి గురించి, తన కేకు గురించి, వాళ్ళ నాన్న తేబోయే గిఫ్ట్ గురించి ఊహిస్తూ పడుకుంటాడు. లిటిల్ పీట్ నిద్రపోయాక, బిగ్ పీట్ పెట్ స్టోర్ కి వెళ్తాడు. (అక్కడ కాసేపు మనకి తెలిసిన జంతువుల గురించి చెప్పి, అవి చేసే సౌండ్స్ గురించి వర్ణిస్తూ కావాలంటే కధ పోడిగించుకోడమే) అప్పుడు ఒక బోనులో ముద్దుగా, బుజ్జిగా, తెల్ల బొచ్చుతో, మెత్తటి తెల్లటి మబ్బులాంటి ఒక కుక్క పిల్ల చిన్నగా బౌ బౌ మంటుంది. దాని చెవులు కళ్ళను కప్పేస్తూ చాలా పొడుగ్గా వుంటాయి. చెవులు అడ్డు వున్నాయి కాబట్టి చూసేముందు అది తల అటూ ఇటూ విసుర్తుంటుంది. అలా విసురుతుంటే దాని మెడలో వున్న ఘంట 'డింగ్ డింగ్' మని మోగుతూ వుంటుంది. చీకట్లో దాని నీలి కళ్ళు మెరుస్తూ వుంటాయి. చీకట్లో దాని అరుపు విని, కళ్ళని ఫాలో అయ్యి బిగ్ పీట్ బోను దగ్గరికి వెళ్తాడు. బోనులో బిగ్ పీట్ వేలు పెడితే అది నాకుతుంది. అది బిగ్ పీట్ కి బాగా నచ్చి, దాన్ని కొంటాడు. అది బౌ బౌ మంటూ వుంటే చూసాడు కాబట్టి, దాని మెడలో ఘంట ఉంది కాబట్టి, దానికి "బౌ బెల్లా" అని పేరు పెడతాడు. ఇంటికి తీసుకొస్తాడు.
లిటిల్ పీట్ తన ఐదో పుట్టినరోజు కోసం రాత్రంతా చాలా excite అయ్యి, ఎన్నో ఆలోచనలతో పడుక్కుంటాడు కాబట్టి, వాడికి ఒక కల ఒస్తుంది. (ఇక్కడ ప్రిన్సుస్స్ స్టొరీ మా అమ్మాయి చెప్పింది చొప్పించా) అందులో వాడే ప్రిన్సు. వాడికి ఒక కుక్క పిల్ల వుంటుంది. వాడు PRINCESS ని రక్షించడానికి ఒక CASTLE కి వెళ్తాడు. ఆ CASTLE ని ఒక డ్రాగన్ కాపలా కాస్తూ వుంటుంది. (ఇది ష్రెక్ స్టొరీ కాపీ) ఆ కలలో వాడు డ్రాగన్ని FIGHT చేసి CASTLE పైనించి పడి పోతాడు. వాడి కుక్క బౌ బౌ మని డ్రాగన్ తో ఇంకా FIGHT చేస్తూ వుంటుంది. కలలో పడిపోతే మెలకువ ఒస్తుంది కదా, లేచి చూస్తే వెలుతురు కనిపిస్తుంది. తెల్లరిపోయిన్దన్నమాట అనుకుంటాడు. మళ్ళీ బౌ బౌ అని సౌండ్ వినిపిస్తుంది. కల ఐపోయింది కదా ఇంకా కుక్క అరుపు వినపడుతోందేమిటి, అని గదంతా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ కుక్క బౌ బౌ మంటుంది. లేచి చూస్తే మంచ కింద నించి సౌండ్ వొస్తుంది. అది వాళ్ళ నాన్న బిగ్ పీట్ వాడికి తెచ్చిన SURPRISE అన్న మాట.
కధ మాంచి కాపీ కధ అనిపించిందా? కాపీయే. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మా అమ్మాయినించి ఒచ్చిన ఇన్పుట్ తో కధ అల్లినందుకు, దానికి చాలా ఆనందం అనిపించింది. నాకు కూడా ఏదో కష్టపడి కధ అల్లితే, తీరా నచ్చకపోతే నిరాశే కాబట్టి - ఈ కాన్సెప్ట్ ఇద్దరికీ వర్క్ అవుట్ అయ్యింది. ఈ సారి మీ పిల్లలకు కధ చెప్పాలంటే ఇలా ట్రై చేసి చూడండి.
అయితే వీటిలో చిన్న రిస్క్ కూడా లేకపోలేదు. పై కధ చివ్వర్లో సమాప్తం చెపుతుండగా ,నాకెందుకో నేను నా గొయ్యి నేనే తవ్వుతున్నానా అనే అనుమానం కలిగింది. ఆరు నెలల్లో రాబోయే మా అమ్మాయి ఐదవ పుట్టిన రోజుకి కుక్క తెమ్మంటే - నా బతుకు కుక్క బతుకే కదా! కాబట్టి ఇలాంటి రిస్కులకు మీరే బాధ్యత వహించే పక్షంలో కట్టు కధలు కుమ్మేసుకోండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
pai para chadivetappudu exactgaa nenade anukunna... goyya gurinchilendi.... :)...
రిప్లయితొలగించండిsree,
రిప్లయితొలగించండిha ha ha. kukka pilla penchadam chaal pedda baadhyatha ani naa abhipraayam. I am not good at that.
తధాస్తు...
రిప్లయితొలగించండిమీ అమ్మాయికి కూడా ఇదే కల వచ్చి అంటే... ఇదే అంటే ఇదే కాదు... కొంచెం ఇంచుమించుగా ఇలాంటిదే వచ్చి తన కుక్క పిల్లకోసం మిమ్మల్ని వేధించుగాక.
కధకన్నా మీరుచెప్పిన ఫార్ములాలు బాగున్నాయి.
ఉ.దా. "ఇలా పేరు ముందు లిటిల్ అని పెడ్తే మనకి తరవాత నాన్నపేరు వేరే ఆలోచించక్కర్లా","(అక్కడ కాసేపు మనకి తెలిసిన జంతువుల గురించి చెప్పి, అవి చేసే సౌండ్స్ గురించి వర్ణిస్తూ కావాలంటే కధ పోడిగించుకోడమే",
naku bow bella kavali....waaaaaaaaaaaaaa...
రిప్లయితొలగించండిIndian Minerva,
రిప్లయితొలగించండిఅమ్మో! కుక్కని పెంచాలంటే కుక్క చాకిరీ కి రెడీ అవ్వాలి.
Sirisha,
రిప్లయితొలగించండిBaavundi. Daanni pet store ki pampichesaanugaa. (Ippudu nenu maro kattu kadha allalemo - chepaloo walmart type lo)