17, అక్టోబర్ 2010, ఆదివారం

బృందావనం - average సినిమా

 రివ్యూ చదివి జనాలు బాగా మోసపోతున్నారు. అమెరికాలో న్యూస్ చానల్స్ లాగ మన దేశం లో సినిమాలని కూడా మనకి వాళ్ళు చెప్పారని చెప్పి చూసి ఇది మంచి సినిమా అనుకోవాలో ఏమిటో? ఇది వరసగా మూడో సినిమా. రోబో సూపర్ హిట్ అన్నారు. రజని ఫాన్స్ ని అడిగితే మాకు నచ్చలేదు అన్నారు. పోనీ సెంటిమెంట్ ఐనా పండిందా అంటే అదీ లేదు. అయినా నాలాంటి సినీ అభిమాని టెక్నికల్ విలువల కోసం, ఐష్ కోసం చూడచ్చు. అది అద్బుతమైన సినిమా అయితే కాదు. దీని ౩.75 /5  rating అనవసరం. ఖలేజా average అన్నారు, కానీ కామెడీ తో అసలు బోర్ కొట్టలేదు. దీనికి ౩/5 ఇచ్చారు. కానీ ఇది సూపర్ హిట్ కాకపోయినా కనీసం హిట్ సినిమా కోవలో వేసుకోవచ్చు. బృందావనం గుడ్ అన్నారు, దీనికి ౩.25 /5 ఇచ్చారు. నాకు మటుకు ఇది average సినిమా అనిపించింది. నిర్మాత గా దిల్ రాజు మీద నమ్మకం పూర్తిగా పోయింది. 
రోబో పాటలు వినగా వినగా నచ్చుతాయి, కొంచెం కొంచెం గా. ఖలేజా లో సదా శివ పాట హై లైట్. బృందావనం లో ఒక్క పాట కూడా బాలేదు. కొన్న CD ఒక సారి విన్న తర్వాత పక్కన పడేసాను. సినిమాలో కూడా కనీసం JR NTR ట్రేడ్ మార్క్ స్టెప్పులు లేవు. మొదటి పాట ఎందుకు ఒచ్చిందో, రెండో పాట ఎందుకు ఒచ్చిందో అసలు అర్ధం కాదు. మూడో పాట locations బావున్నా అసలు స్టెప్స్ లేవు. నాలుగో పాటలో వేయించిన స్టెప్ మొదటి సారి JR NTR ఈ స్టెప్ సరిగ్గా వెయ్యలేకపోయాడనిపించేలా ఉంది.  ఇక పోతే సినిమా మొదటి బాగం ఇంటర్వల్ ఒచ్చేస్తోంది అని కధని కంగారుగా పరిగెత్తించినట్లు వుంటుంది. హీరో మొదట్లో తన స్నేహితుడిని బైక్ మీద కూర్చో పెట్టుకునే స్టంట్ చూస్తూనే ఇంత అవసరమా అనిపిస్తుంది. అక్కడనించి fights ఈ రోజులలో రొటీన్ అనిపించాయి. SOUND లేకుండా కొట్టిన FIGHT అంత అవసరం ఏమిటో తెలియదు. చెట్టు లోకి కత్తి దూసి కోసేసి ఆ తరవాత కూల్చేయ్యడం మరీ అతి.
   డైరెక్టర్ కొన్ని basics ని సరిగా పట్టించుకోలేదని తెలిసిపోతుంది. తన ఇంట్లో ఇరవై మంది ఉంటారని కాజల్ చెప్తుంది, సినిమా అంతా చూసినా పని వాళ్ళతో కలుపుకుని ఇరవై మంది కారు. సమంతా సెకండ్ హాఫ్ లో ఒచ్చినప్పుడు కాజల్ కి చెల్లి అని తెలియకపోవడం చాలా హాస్యాస్పదం. అసలు ఆ అమ్మాయి ప్రస్తావన ఆ కుటుంబాలలో ఎక్కడా రాదు. ఏదో పక్క పక్క వూర్లు రెండు జిల్లాలు కాబట్టి తెలియ లేదని చాలా సింపుల్ గా చెప్తారు, మనం ఏదో రివ్యూ నమ్మి సినేమాకీ ఒచ్చాము కాబట్టి ఏం చెప్పిన చెల్లుతుందని అనుకుంటారో ఏమో. కాజల్ తో JR NTR ప్రేమ ఎలా కలిగిందో మనకి అంత కన్విన్సింగ్ అనిపించదు. అసలు ఒక డైలాగ్ తో ఇంటి అల్లుళ్ళు మారిపోయి, వాళ్ళ మూలంగా బ్రహ్మాజీ మారిపోవడం చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది. తనికేళ్ళని, కోటాని సరిగా ఉపయోగించుకోలేదు. పల్లెటూరిలో ఇల్లు, దాని వెనక కొలనులో బాతులు కొంచెం అసహజంగా అనిపించాయి.
హీరో JR NTR కొంచెం జాగ్రత్త పడాలి, ఎందు కంటే ఈ సినిమా తో కొంచెం అతని సెలక్షన్ మీద నమ్మకం తగ్గుతుంది. ఏది బాలేకపోయినా పాటలు, స్టెప్పులు బావుంటే అదుర్స్ లా ఆడేస్తుంది. కామెడీ ఒక మోస్తరుగా ఉంది. ఈ సినిమా మటుకు దసరా హడావిడి మూలంగా ఆడాలి గానీ, నిజం చెప్పాలంటే సినిమా AVERAGE . JR NTR sincere గా నటించాడు, HEROIN లు అందంగా వున్నారు. సినిమా హాలుకి వెళ్లి డబ్బులు పెట్టి చూసే అంశం ఏమీలేదు ఈ సినిమాలో. రెండు నెలలు ఆగితే టీవీ లో చూడచ్చు అనిపించే సినిమా.

6 కామెంట్‌లు:

  1. ఈ విజయదశమికి ఆ జగజ్జనని మీకు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............

    - SRRao

    శిరాకదంబం

    రిప్లయితొలగించండి
  2. SRRao గారు,
    థ్యాంక్ యూ. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. >>సినిమా హాలుకి వెళ్లి డబ్బులు పెట్టి చూసే అంశం ఏమీలేదు ఈ సినిమాలో. రెండు నెలలు ఆగితే టీవీ లో చూడచ్చు అనిపించే సినిమా. <<

    ఎవరికీ చెపుతున్నారు ?

    మీ దృష్టిలో సినిమా థియేటర్ కు వెళ్లి చూసే సినిమా ఒకటి కూడా వుండి వుండదు.

    రిప్లయితొలగించండి
  4. a2zdreams,
    పొరపాటు. నేను ఈ సినేమాని హాలులోనే చూశాను. ఇంటెర్నెట్ లో చూసే అలవాటు లేదు. మా ఏరియా లో వేసే సినేమాని నేను న్యూ జర్సీ లో చూసిన తరవాత కూడా మళ్లీ చూస్తాను, ఒక్కోసారి మా ఫ్యామిలీ ని తీసుకెళ్ళి టికెట్ తీసుకుని బయట మా అమ్మాయిని ఆడిస్తూ ఉంటా. ఆదూర్స్, యమ దొంగ కూడా నేను హాలులోనే చూశా. అవి హాలులో చూడదగ్గ చిత్రాలు. నేను అన్ని చిత్రాలని హాలులోనే చూడాలని గట్టిగా నమ్ముతాను, కానీ ఈ రోజులలో ప్రేక్షకుడిని హాలుకి తీసుకురావాలంటే చాలా కష్టం. మంచి రివ్యూ లు ప్రేక్షకులని హాలుకి తీసుకు రావాలి. నా లాంటి వాడు ఇంచుమించు అన్ని చిత్రాలు హాలులోనే చూస్తాడు. అక్కడ ఐతే పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.నేను మంచి సినేమా నలుగురూ చూసి ప్రోత్సహిస్తే మరిన్ని మంచి చిత్రాలు వొస్తాయనే ఆశ వున్నవాణ్ణి.

    రిప్లయితొలగించండి
  5. మీరన్నట్టు సినిమా యావరేజే! మానవాతీతమైన ఫైట్లు వగైరాలను నేను పట్టించుకోడం లేదుగానీ (పట్టించుకునే స్థాయిని మన సినిమావాళ్ళు దాటించేసారెప్పుడో) హాస్యం మాత్రం బాలేదు. హాస్యం బావుంది బావుంది, బ్రహ్మానందం ఎన్టీయార్ సీన్లు బాగా పండాయి అంటూ చెప్పారెక్కడో - హాస్యం బాలేదు, వాళ్ళిద్దరి సీన్లు అస్సలు బాలేదు -వెకిలిగా ఉన్నాయి. మీరు కామెడీ ఒక మోస్తరుగా ఉందని అన్నారుగానీ, అది అర మోస్తరే!

    రిప్లయితొలగించండి
  6. చదువరి,
    థ్యాంక్ యూ. నిజమే,ఎన్టీయార్ బ్రహ్మానందం హాస్యం ఇంతకన్నా అదుర్స్ లో బావుంది.

    రిప్లయితొలగించండి