14, అక్టోబర్ 2010, గురువారం

భవిష్యత్తులో జగమంత కుటుంబం - ఏకాకి జీవితం, అందరికీ గారంటీ

భవిష్యత్తులో జగమంత కుటుంబం - ఏకాకి జీవితం, అందరికీ గారంటీ. "ఏమిటి బాబు! ఈ పైత్యం. ఏదో సిరివెన్నెల గారు తన కవి హృదయం తో మంచి పాట రాసుకున్నారు అనుకో- దానిని ఇలా అందరికీ ఆపాదించి, వారి భవిష్యత్తు అని నిర్దారించడం ఏమిటి? హన్నా!" అని మీరు గదమాయించడం ఐపోతే, నా పాయింట్ చెపుతా.
జగమంత కుటుంబం - inetrnet లో, ఏకాకి జీవితం - ఇంట్లో. "అద్గదీ. అలా రా! దారికి." అని అనుకున్నారా? ఆలోచించండి, ఈ రోజులలో మనిషి మనిషిని కలిసే అవసరం తగ్గిపోయింది. అందరికీ వ్యక్తిగత స్వేచ్చ, పర్సనల్ స్పేస్ కావాలి. ఒక ఇంట్లో ఎంత మంది మనుషులు వుంటే అన్ని TV లు ఉంటున్నాయి. అంటే ఏ ఇద్దరూ కలిసి ఒకే ప్రోగ్రాం చూడరన్న మాట. ఎంత మంది మనుషులుంటే అన్ని సెల్ ఫోన్ లు ఉంటున్నాయి.  ఎంత మంది వుంటే అన్ని కంపూటర్లు. ఒకళ్ళ కంప్యూటర్ PASSWORD ఇంకోళ్ళకి చెప్పరు. విదేశాలలో అయితే పిల్లలకు కూడా ప్రత్యేక గదులు, వాళ్ళు అవి ఎవ్వరితోటీ షేర్ చేసుకోరు. ఇంటికి చుట్టం ఒస్తే పిల్లలని బతిమాలుకోవాలి, ఈ ఒక్క రోజు నువ్వు మా రూం లో పడుకుని ఒచ్చిన వాళ్లకి రూం ఇయ్యరా అని. అందరూ కలిసి సినిమా కి వెళ్ళే రోజులు పోయాయి. ఈ రోజులలో పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా కంప్యూటర్ మీద ఎక్కడో వున్నఇంకో ఆటగాడుతో ఆడుకుంటారు. అంటే ఆడుకోవడానికి కూడా మనం మనిషిని కలవక్కర్లేదు అన్న మాట. నాకైతే మూడు నెలలు నించి నేను ఇంటి నించి పని చేస్తున్నాను. అంటే వర్క్ ఫ్రం హోం కాంట్రాక్టు అన్నమాట. నాతో పని చేసే ఏ మనిషినీ నేను చూడలేదు, కనీసం ఎలా ఉంటారో కూడా తెలియదు - కానీ మేమంతా ఒకటే టీం మరియు కలిసి పనిచేస్తున్నాము. అంటే  నేను మనుషులతో తక్కువ ఇంటర్నెట్ లో ఎక్కువ గడుపుతున్నాను. ఇంటర్నెట్ లో కెళ్తే నాది జగమంత కుటుంబం. కానీ ఈ అలవాట్లు అన్నీ మనిషికి మనిషి అక్కర్లేదు అని నిరూపిస్తున్నాయి. స్వేచ్చ అలవాటు అయితే ఆ మనిషికి ఇంకో మనిషి పొడ గిట్టదు. ఈ కాలంలో ఇంటికి చుట్టాల్లు ఒస్తే మనకి ఇబ్బంది అనుకునే మనుషులే ఎక్కువ. అత్త  మామ ఇంటికి ఒస్తే తనకి ఇష్టం ఒచ్చిన డ్రెస్ లు వేసుకునే స్వేచ్చ లేదని వాపోయే కోడల్లే అన్ని చోట్లా. అమెరికా లో ఎవరి ఇంటికి మీరు ముందుగా కాల్ చెయ్యకుండా, వెళ్లి ఒక రోజంతా గడిపి రాగలరు చెప్పండి. సరిగ్గా వెదికితే ఒక్కడు వుంటే అదృష్టం. ఇలాంటి అలవాట్లతో జనాల జీవితాలు భవిష్యత్తులో ఏకాంతం అవ్వడం ఖాయం . అందుకనే అంటున్నాను  "భవిష్యత్తులో జగమంత కుటుంబం ఇంటర్నెట్ లో - ఏకాకి జీవితం ఇంట్లో, అందరికీ గారంటీ" అని.

8 కామెంట్‌లు:

  1. nice post. internet valla prapancham mana chetullo undi anukuntaam kaani manavaallaki manam dooram ayipotunnam ani alochinchatledu evaru...'అత్త మామ ఇంటికి ఒస్తే తనకి ఇష్టం ఒచ్చిన డ్రెస్ లు వేసుకునే స్వేచ్చ లేదని వాపోయే కోడల్లే అన్ని చోట్లా. అమెరికా లో ఎవరి ఇంటికి మీరు ముందుగా కాల్ చెయ్యకుండా, వెళ్లి ఒక రోజంతా గడిపి రాగలరు చెప్పండి. ' ee matalu 200% nijam :)

    రిప్లయితొలగించండి
  2. మనసు విప్పి మాట్లాడడము అంటే బహుశా ఇదేనేమో

    రిప్లయితొలగించండి