आने वाला कल इक सपना है
गुजरा हुआ कल बस अपना है
हम गुजरे कल में रहते है
यादों के सब जुगनू जंगल में रहेते है
వయసులో వున్నప్పుడు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఎన్నో సార్లు పాడేవాడిని. ఎప్పుడూ ఈ పాటని హమ్ చేస్తూ వుండే వాడిని. ఒక రోజు కార్ లో పాట విందామని గ్లోవ్ బాక్స్ లో వెతుకుతుంటే పాత కాసేట్ బయట పడింది తవ్వకాలలో. మనం ఒక్కళ్ళమే వున్నాము కాబట్టి మనకి నచ్చిన పాట పెట్టుకునే అవకాశానికి ఆనందిస్తూ ప్లే చేసాను. పాట వింటూ ఆలోచించడం మొదలు పెట్టా. అసలు ఈ పాట నాకు ఎందుకు నచ్చింది అని.
ఇప్పుడు దీని అర్ధం తెలుగులో చూద్దాం.
రాబోయే రేపు ఒక స్వప్నం
గతించిన నిన్న నా సొంతం
నేను గడిచిపోయిన నిన్నలో బతుకుతాను
జ్ఞాపకాల మిణుగురులు అన్నీ అడవిలో నివసిస్తూ వుంటాయి
దీనిని కొంచెం ముందుకి వెళ్లి విశ్లేసిస్తే. నేను గతాన్ని పట్టుకుని వేళ్ళాడుతాను, ఎందుకంటే నాకు రేపు ఒక స్వప్నం కాబట్టి , నాకు అది తీరుతుందని నమ్మకం లేదు కాబట్టి అన్నట్లుంది.
వయసులో వున్నప్పుడు మన ఆలోచనలు కొంచెం ఇలా వుంటాయి. ఆ రోజులే బావున్నాయని అనిపిస్తుంది. కొందరికి అయితే బాధ లో వున్న డెప్త్ ఆనందం లో వుండదు. అందుకనే అప్పుడు మనకి నచ్చే స్లో సాంగ్స్ ఎంతో melancholy వున్నవి నచ్చుతాయి. కొంచెం ముందుకెళ్ళి మన తండ్రుల generation చూస్తే వాళ్ళంతా దేవదాసు ప్రేమకి నీరాజనాలు పట్టారు. బొచ్చు కుక్క, మందు బాటిల్ ట్రేడ్ మార్క్ తోటి ఖల్లు ఖల్లు మంటూ కుళ్లిపోతూ దగ్గిన దేవదాసు ప్రేమకి కన్నీళ్ళు పెట్టి కర్చీఫ్లు తడిపేసారు. ఇలాంటివి నచ్చుతాయి, ఇందులో ఒక రకమైన identity వుంటుంది. నిజం చెప్పాలంటే బాధ, కష్టాలు అనే baggage మనం ఎక్కువ మోస్తాము. అలాంటి విషయంలో మనం ఓదార్పు ద్వారా గుర్తింపు అనో, లేదా ఓదార్పునో అంతర్లీనంగా కోరుకుంటూ ఉంటాము. మందు కొట్టే మగాళ్ళని చూడండి, కిక్కు ఎక్కిన తరవాత వాళ్ళ ప్రవర్తన చూడండి. ఆడవాళ్ళు అయితే ఏడుపుతో ఓదార్పు తెచ్చుకుంటారు.
నిన్నటి జ్ఞాపకాలు ఆనందకరమైనవి అయితే గొడవ లేదు. కానీ ఎలా అవుతాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, థ్రిల్ తీరిన తరవాత దాన్ని నిరంతరం మోసుకుంటూ ఆనందపడే లక్షణం ఉండాలిగా? అలా చెయ్యడంలో అపీల్ లేదు. ప్రేమ సినిమాలు ప్రతీ సంవత్సరం ఎన్నో వొస్తాయి, కానీ అందులో ఎన్ని క్లాసిక్ సినిమాలు అని జనం అనుకుంటారు. ఎన్ని సినిమాలు గుర్తు పెట్టుకుంటారు. అదే ఒక దేవదాసు, ఒక మరో చరిత్ర ఆ తరాలకి చెరగని ముద్ర వేసినా సినిమాలుగా నిలిచిపోయాయి.
అల్లాగే జీవితంలో మనకి నిన్న మిగిల్చినవి చెడు అనుభవాలు అయితే, జ్ఞాపకాల అడవిలో చీకటీ మనలని వెంటాడుతుంది కదూ. ఈ పాట లో ఒక సందేశం ఉంది. అదేంటంటే నిన్నని పట్టుకుని వేలాడే జీవితం, రేపటి స్వప్నాన్ని ఆశిస్తుందేమో కానీ నేటి కర్తవ్యాన్ని మర్చిపోయింది. అలా మర్చిపోయి నిన్నలో బతికే మనస్తత్వం వుందని మరీ మరీ చెప్తోంది. రేపటి స్వప్నం కోసం ప్రయత్నాన్ని పక్కన పడేసి, నిన్నని నెమరు వేస్తోంది.
యుక్త వయసులో ఆ ఆలోచనా విధానానికి అప్పుడు పాట నచ్చినా, ఇప్పుడు మటుకు పాట చెప్పే పాటం తెలిసింది.
ee album mottam naaku chaala chaala ishtam chandu.. movie artham avvaledu kaani music is awesome..
రిప్లయితొలగించండిsree,
రిప్లయితొలగించండిSongs are worth remembering. I don't even remember the movie.