15, అక్టోబర్ 2010, శుక్రవారం

చంటి పిల్లల అనారోగ్యం మిమ్ములని కాలు చెయ్యి ఆడనివ్వట్లేదా?

మా అమ్మాయికి చిన్న నలత చేసినా, నాకు కంటి మీద కునుకు వుండదు. అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తాను. డాక్టర్లను కాల్ చేసి, సంప్రదించి విసిగిస్తాను. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ సంపాదించి.  మందుల షాప్ లో వున్న అన్ని మందులూ తెచ్చి. నా ఆప్త మిత్రులని - అందులో డాక్టర్ ఐన వాళ్ళని మరీ మరీ ఇబ్బంది పెట్టి- రక రకాల ప్రశ్నలతో వేదిస్తుంటాను. సరే, ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఏది చిన్న అనారోగ్యమో, ఏది కంగారు పడాల్సిన పరిస్థితో మనకి తెలియదు కదా. ఇలాంటి పరిస్థితులలో నేను డాక్టర్ కానందుకు చాలా చింతిస్తాను. నా జీవితంలో నేను ఏదైనా కాలేకపోయాను అనే బాధ ఆ ఒక్క విషయంలోనే అనిపిస్తుంది. మొదట్లో చాలా చిన్న విషయాలకే ఎక్కువ కంగారు పడ్డానని అర్ధం అయ్యింది. మెల్లగా ఒక్కొక్క విషయం గూగుల్ చేసి తెలుసుకుంటూ వున్నాను. అలా చేస్తుంటే ఈ కింద వెబ్ సైట్ కనిపించింది. ఇందులో వున్న చార్ట్ పిల్లల తల్లి తండ్రులకు బాగా ఉపయోగ పడుతుంది. ఇది మనం వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సిన పరిస్థితో కాదో తెలుసుకోడానికి ఉపయోగిస్తుంది. కింద ఇవ్వ బడ్డ లింక్ క్లిక్ చేసి చూడండి.

http://familydoctor.org/online/famdocen/home/tools/symptom/504.html

Image source: http://www.picturesof.net/pages/090513-150628-973053.html

3 కామెంట్‌లు:

  1. వైద్యం లెక్కలు కాదు మాస్టారు , flow chart చూచాయగా ఉపయోగపడుతుంది కానీ అన్నే వేళలు అది సరి కాదు , అందులోను వాడు ఇచ్చిన ప్రతి జబ్బు గురించి గూగుల్ చేస్తే గుండె బెదిరిపోతుంది , ఒక్కోసారి తక్కువ తెలేయడమే మంచిదేమో

    రిప్లయితొలగించండి
  2. naren,
    నిజమే. కానీ ఇక్కడ శని,ఆది వారాలలో డాక్టర్ దొరక్కపోతే చిన్న అనారోగ్యానికి కూడా ఎమర్జెన్సీ కి పరిగెత్తి కో-పే వంద నించి ఐదు వందలు సమర్పించి, అక్కడ నాలుగు గంటలు పైన వేచి ఉండే వాళ్ళకు కొంత ఐనా ఉపయోగ పడుతుందేమోనని.

    రిప్లయితొలగించండి
  3. నిజమే ఒప్పుకుంటున్నాన్ను

    రిప్లయితొలగించండి