10, అక్టోబర్ 2010, ఆదివారం
సిల్లీ బాండ్స్
ఈ మధ్య పిల్లలలో బాగా డిమాండ్ వున్న వొస్తువు. వీటి కోసం చాలా స్కూల్ లలో పిల్లల మధ్య గొడవలు అవుతున్నాయని చాలా చోట్ల చదివాను. వీటిని స్కూల్ లకి పిల్లలు తీసుకు రాకూడదని, వీటి పైన నిషేధం విధించిన స్కూల్స్ కూడా వున్నాయి. వీటి డిమాండ్ తట్టుకోలేనంత వుందని వార్తలు ఒచ్చాయి. నేనే స్వయంగా నా కూతురికి మూడు సార్లు కొనిపెట్టాను. మొదటి సారి అది అడిగినప్పుడు ఎక్కడ దొరుకుతుందో తెలీక చాలా చోట్ల అడిగాను. కొన్ని చోట్ల స్టాక్ లేదని చెప్పారు.
వీటి ధర కొంచెం ఎక్కువే వుండేది మొదట్లో. నేను నాలుగున్నర డాలర్లు పెట్టి కొన్నట్లు గుర్తు. ఇప్పుడు రెండు డాలర్లకు కూడా దొరుకుతున్నాయి. మొదటి సారి పైన చూపించిన జంతువుల సిల్లీ బాండ్స్ కొనుక్కుంది. ఆ తరవాత princess సిల్లీ బాండ్స్ నాకు లేవు అని పట్టు పట్టి మరీ కొనుక్కుంది. ఇంకో సారి ఇలాగే కౌంటర్ లో డబ్బులు కడుతుంటే మధ్యలో ఈ ఐటెం కనిపించింది. ఇంక కౌంటర్ దగ్గర గొడవ ఎందుకని కొని పెట్టాను.
అప్పుడప్పుడు ఇలాంటి వొస్తువు ఒకటి కనిపెట్టి పిల్లల్లో బాగా CRAZE తీసుకొచ్చి అమ్ముకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుంటాను.
కాకపోతే కొనేటప్పుడు నాలాంటి ప్రతీ తండ్రీ పిల్లల మీద ప్రేమతో ఏమీ అనలేక కనిపెట్టిన వాడిన అడ్డమైన బూతులు తిడతారనుకోండి.
Picture taken from http://www.youthbeat.com/Portals/33268/images/silly%20bandz.jpg
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నేను ఇవి రెండు మూడు చోట్ల చూసానండీ కానీ ఇప్పుడే ఇవేంటో అర్ధమయింది :)
రిప్లయితొలగించండిఇందు,
రిప్లయితొలగించండిమా అమ్మాయి ఇవి చేతికి ఒక డజను వేసుకుని నచ్చిన వాళ్ళకి ఒకటి తీసి చేతికి తొడిగెస్తుంది.
india lo paristhithi inka goram bill kattedaggere pillala items peduthnnaru paiga vizianagaram lo aithe imported ane chinna label peddha billu . nenaithe bill dhaka vachinappudu ( amma ala velli adukondamma ane cheppi thiruguthunnanu )
రిప్లయితొలగించండిnaren,
రిప్లయితొలగించండిMaa daggara adugaduguna vuntaayi WALMART lo, aapadam kashtam.