13, అక్టోబర్ 2010, బుధవారం
కొంత మంది యువకులు వృత్తి వల్ల వృద్ధులు
హలో! మాస్టారు. ఎవడినో ఉద్దేశించి రాసానని తెగ కుతూహలంతోటి ఈ టైటిల్ చూసి రెండు నొక్కులు నొక్కారా? మీరు సాఫ్ట్ వేర్ రంగంలో పని చేసే నడి వయస్కులు అయితే, మీలాంటి వాళ్ళ గురించే నండీ ఈ టపా. సాఫ్ట్ వేర్ కాకపోయినా, ముఖ్యంగా మీ జీవన్ భ్రుతికి మీకు కంప్యూటర్ ముందు జీవితమే గతి అయితే మీ లాంటి వాళ్ళ గురించే. అంటే నేను కాదేమోనని అనుకునేరు. నేను కూడా ఒకడినే.
భారతీయులకు చాలా మందికి (ఇప్పటి నడి వయస్కులకు)స్కూల్ రోజులలో కంపూటర్లు లేవు. చాలా కాలేజీ లలో అయితే ఆ రోజులలో కంప్యూటర్ కూడా అందరు టైం పంచుకోవాలి- షేరింగ్ అన్న మాట. కాబట్టి అక్కడి దాక బానే ఉంది, ఆ తరవాత ఒచ్చింది తంటా. ఉద్యోగాలలో మొదట్లో బాగా కష్టపడి వుద్యోగం నిలబెట్టుకోడానికి కంప్యూటర్ ముందు గంటలు గంటలు పని చెయ్యడం మొదలు పెడతారు. ఆ రోజులలో మేము అంతా 14 గంటలు పని చేసేవాళ్ళం. ఇప్పటికీ కొత్త ఉద్యోగస్తులు 12 గంటలు పని చేస్తూ వుంటారు రోజుకి. అలా మొదలు అవుతుంది.
ప్రాజెక్ట్ డెడ్ లైన్ అనీ, ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్ అనీ ఒక్కో సారి ఇల్లు కూడా చూడకుండా పని చెయ్యాలి. దీనికి తోడు పక్క వాడు పైకి వెళ్లి పోతున్నాడని- మనకి కడుపు మంట తోటో, బాధ తోటో, మనం కూడా పైకి వెళ్ళాలంటే వాడికంటే ఎక్కువ పని చేసి మన పై ఆఫీసర్ ని మస్కా కొట్టాలి. ఆ తరవాత అందరూ విదేశాలకు వెళ్లారు మనకి మందలో పరువుపోతోందని అనిపించినందుకో, కొత్తగా కొన్న ఇంటికి అప్పు తీర్చాలని ఆన్-సైట్ లో అయితే నాలుగు రాళ్ళు వెనక వేసుకోవచ్చని, విదేశాలలో వుంటే కట్నం బాగా పలుకుతున్దనో ఎలాగోలా వేరే దేశం చేరతారు. అక్కడ నించి వుద్యోగం లేక పోతీ వేరే దేశం లో బతుకు కుక్క బతుకు అని అర్ధం అవుతుంది. ఇండియా లో ఐనా సాఫ్ట్ వేర్ బతుకులు అలాగే వున్నాయి అనుకోండి. ఆ దెబ్బ తోటి మళ్ళీ విపరీతం గా పని చెయ్యడం. మెల్లగా గూగుల్ కి, ఆన్ లైన్ చాట్ లకీ, వీడియో లకీ, సినిమాలకీ కంప్యూటర్ చూడడానికి అలవాటు పడతారు. తరవాత పెళ్లి జరుగుతుంది, కొత్త పెళ్ళాం మోజులో కొంచెం పని తగ్గించి పెళ్ళాన్ని నాలుగు ఊరులూ తిప్పి- నాలుగు ప్రదేశాలు చూపించి- నలుగురికి పరిచయం చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు ఎంజాయ్ చేసేటప్పటికి ఒక పాపో బాబో రెడీ. డెలివరీ కోసం ఒచ్చిన అత్తా-మామనో, అమ్మ-నాన్ననో మొక్కుబడికి తిప్పేసి పిల్లాడో/పిల్లో పుట్టాక ఆరు నెలలు అయ్యాక పంపించేశాక వుంటుంది మజా.
అప్పటికి భార్యా భర్తల మధ్య మోజు తగ్గుతుంది. ఆఫీసు లో పని ఒత్తిడితో మొగుడు - ఇంట్లో పని ఒత్తిడితో పెళ్ళాం వుంటారు. ఇద్దరూ పని చేస్తే ఇంక గొడవే లేదు - నా ఉద్దేశ్యం ఇంక గొడవ తప్ప ఏమీ లేదు అని. ఎవరితో ఆడుకోవాలో తెలియక పిల్లలు అమ్మనీ నాన్ననీ వాళ్ళ విపరీతమైన energy (అసలే ఇండియన్ స్టోర్ లో బూస్ట్, ఆర్గానిక్ పాలతో కలిపి పట్టే అలవాటు కదా మనకి) తో వెంట పడుతూ వుంటారు. ఇద్దరికీ అపురూపం కాబట్టి పిల్లల మీద కోపాన్ని మోజు తీరిన పెళ్ళాం మీద, పని చెయ్యని మొగుడి మీద వెంటనే కత్తులు దూసి నువ్వంటే నువ్వని గొడవలు మొదలు.
ఈ సమస్యకి కొంత కారణం చాలా మందికి తొందరగా వోచ్చేస్తున్న వృద్దాప్యం. నిజమే! ఈ రోజుల్లో నలభై కి దగ్గరలోకి రాకుండానే చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి నడుం నొప్పి చాలా కామన్ ప్రాబ్లం. కొలస్ట్రాల్ ఎక్కువ వుండడం, diabetes , హై లేదా లో బీపీ మరియు మోకాళ్ళ నొప్పులు చాలా మందికి నలభై లోకి రాకుండానే ఎదురవ్వుతున్నసమస్యలు.
ఇలాంటి సమస్యలతో పిల్లలతో పరిగెత్తే ఓపికే వుండదు. తీరిక లేకుండా పని చేయడం తో అలసట, ఎక్కువ పని చెయ్యడం తో అనారోగ్యం. ఒకళ్ళతో-ఒకళ్ళు సమయం గడపక పోవటం వల్ల అవగాహన లోపం. నిత్యం గొడవలతో, పని ఒత్తిడి తో మానసిక సమస్యలు.
ఇవన్నీ కలిసి ఈ సాఫ్ట్ వేర్ వాళ్ళను నేను చెప్పినట్లు "కొంత మంది యువకులు వృత్తి వల్ల వృద్ధులు" అనిపించేలా చేస్తున్నాయి కదూ! ఆలోచించండి..
Image source: http://accomplishvirtualassistant.files.wordpress.com/2010/09/computer-problems.jpg
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాగుంది మీ పోస్ట్, మొన్నేమధ్య నెట్లో ఒక ఫోటో చూశా. జీవ పరిణాం. వంగిన చిమ్పంజి ల నుంచి మెల్లగా కాలక్రమేణ నిటారుగా నిలబడే మనిషి గా మారిన తర్వాత మళ్ళి మెల్లగా కంప్యుటర్ లతో వంగిపోయిన చిమ్పాజి ల లాగ తయారవుతున్నారు. ఎక్కడినుంచి వచ్చామో మళ్ళి అక్కడికే రూపంలో. .మీ పోస్ట్ చదువుతుంటే ఆ ఇమేజ్ గుర్తొచ్చింది
రిప్లయితొలగించండిభాను,
రిప్లయితొలగించండినేను కూడా చూశా ఆ ఫోటో. నచ్చినందుకు థాంక్స్,
>>వెంటనే కత్తులు దూసి నువ్వంటే నువ్వని గొడవలు మొదలు.
రిప్లయితొలగించండిమా ఇంట్లోకి మొన్న తొంగిచూసారా ఏమిటి కొంపదీసి?:)
agnaata,
రిప్లయితొలగించండిహహాహ్హ.. ఇది ఇంటింటి భాగోతం.
very good.
రిప్లయితొలగించండిఇది అచ్చమైన డయాస్పోరా టపా :)
కొత్త పాళీ,
రిప్లయితొలగించండినిజమే. ఇక్కడి ఎందరిదో ఇదే పరిస్థితి.